
SKBRC పెట్టిన 20 సం ల తరువాత కొత్త తరం లెక్చరర్స్ విధుల్లోకి వచ్చారు.వాళ్ళలో కొంతమంది అక్కడే చదివినవారు .. వారిలో మన ఈనాటి ఆణిముత్యం పోడూరీ వెంకట రమణ శర్మ ఒకరు !
అదే సమయం లో విద్యా విధానం లో వచ్చిన మార్పులు తరగతి గదులను నూనూగు మీసాల నవ యువకులతో నింపింది . Curriculum లో కూడా మార్పులు చేశారు. Shakespeare, Milton లను చదివే బాధ తప్పింది . ఈ మార్పులు యువతరం లెక్చరర్స్ లో సంతోషం నింపి విద్యార్థులకు చేరువ చేసింది .
పోడూరి రమణ శర్మ గారు మన కాలేజ్ లో PUC, B Com చదివారు . వారి బి కాం class లో 16మంది ఉండేవారు . వారిలో చాలా మంది M Com కోసం AU కి వెళ్లారు . 1968 లో M.Com తరువాత రమణ శర్మ మన కాలేజ్ లో లెక్చరర్ గా చేరారు
తన టీచింగ్ skills ను నిరూపించుకొని బాగా చెపుతారు అనిపించుకోవడానికి ఆయనకు ఎక్కువ సమయం పట్టలేదు దానికి సాక్ష్యం….ఇంటిముందు తెల్లవారు ఝాము నుంచి కాలేజ్ కి వెళ్లేంత వరకు-తిరిగి సాయంత్రం 8 గం ల వరకు నిలిచి ఉండే tuition విద్యార్థుల సైకిళ్లే!
Comfort zone లో ఉన్న వారు తమ వృత్తి మార్గాన్ని మార్చుకోవడం అరుదుగా జరుగుతుంది !
పుట్టి పెరిగిన ఊరిలో , తాను చదువుకున్న కాలేజ్ లో లెక్చరర్ ఉద్యోగం ! సమాజం లో, విద్యార్థుల మధ్య మంచి పేరు ప్రఖ్యాతులు . ట్యూషన్ ల కోసం queue కట్టిన విద్యార్థులు.ఇవేవీ రమణ శర్మ గారిని మరో కొత్త వృత్తి వైపు చూడకుండా చేయలేక పోయాయి .
దశాబ్దం పాటు కాలేజ్ లెక్చరర్ గా పని చేశాక .రమణ శర్మ గారి దృష్టి corporate ప్రపంచం వైపు మళ్లింది . కంపెనీ సెక్రటరీ కోర్స్ చేయడం మొదలు పెట్టారు 1980 నాటికి ఆయన కోనసీమ నుంచి వచ్చిన మొదటి కొంతమంది ACSలలో ఒకరిగా నిలిచారు.
Class రూమ్ నుంచి కార్పొరేట్ ప్రపంచం లోకి ప్రయాణం అలా మొదలైంది .25 సం ల పాటు వివిధ ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలలో CS గా జనరల్ మేనేజర్ గా, financial adviser గా ఇండియా లోను ఇతర దేశాలలోను పని చేశారు .
ఆయనకు అది ఒక కొత్త ప్రపంచం . ప్రతి పనిని సమయసీమలో పూర్తిచేయాల్సిన ఒత్తిడిలనుతట్టుకొంటూ అందరి మన్ననలను పొందారు . దీ ని తో రమణ శ ర్మ ఎలాంటి పరి స్థితులలోనైన తాను ఇమిడిపోగలరని నిరూపించుకున్నారు .
పదవీ విరమణకు దగ్గరవుతున్నప్పుడు రమణ శర్మ గారి మనసులో కొత్త ప్రశ్నలు మొదలయ్యాయి .
అవి భౌతిక ప్రపంచానికి చెందినవి కావు ! సమాధానాల కోసం వెతుకులాట మొదలైంది .
చిన్నప్పటి నుంచి అంతర్గతం గా ఆయనకి ఒక నమ్మకం- ఏ మనిషి లోను వ్యక్తి అనేవాడు ప్రత్యేకంగా లేడు అని,అందరి ప్రవర్తన, గడియారం లో మూడు ముల్లులకి , వాటి వెనకాల ఉన్న యాంత్రిక శక్తి ఎలా ఆధారమో,మనుషులు అందరినీ నడిపించే శక్తి ఒకటే అన్నది రమేష్ బల్శేకర్ వంటి జ్ఞానులను కలిసి దృవ పరచుకున్నారు.
91 లో కంపెనీ సెక్రటరీ ల లోకల్ చాప్టర్ చైర్మన్ అయిన తరువాత, ఆయనకి ఒక ఆలోచన స్పురించింది.ధనం, పేరు ప్రఖ్యాతులు వంటి వాటి వెనక పరిగెడితే, శాశ్వత ఆనందం దొరకదు అని గ్రహించి, ఆధ్యాత్మికం గా స్వరూపం గుర్తింపు కోసం ప్రయాణం సాగించారు
1991 లో రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్లడం తో ప్రారంభం అయి, అయన మార్గం లో ఇరవై ఏళ్ళ సాధన తరువాత , ఎల్లి రూజ్ దార్ వంటి జ్ఞానుల సహాయం తో, పరోక్ష జ్ఞానాన్ని , అనుభవ జ్ఞానం గా మార్చుకోవడం, ఒక గొప్ప అదృష్టం.. గురువుల సహాయం తో గ్రహించినది, ఉపనిషత్తుల సారం తో పోల్చుకోవడం జరిగి, అందుకున్న అవగాహన ఊహ కాదని ధృవీకరించు కున్న తరవాత, మార్గం లో ఉన్న సాధకులకు ఉపయోగపడేలా,
అరుణాచలం పిలుపు కథలు, అన్వేషణ ,
A Search In Vedic India ( notionpress.com/amazon} వంటి
రచనలు చేశారు. ఆసక్తి ఉన్న వారు వారి ఈ రచనలను
www.youtube.com/@rpodury (playlist) లో ఆడియోలో వినవచ్చు. అన్వేషణ పుస్తకం కావలిసిన వారు, ఆయనకి ఫోన్ చేసి పొందవచ్చు అయన రచించిన వంద కధల దాకా ప్రతిలిపి (ఇ మ్యాగజైన్ )లోను, గో తెలుగు లోను ఏడు లక్షలు కు పైగా పాఠకులు చదివి కొన్ని వేల మంది అనుసరించడం జరిగింది. పంజరం, మూగ ప్రేమ, అరుణాచలం పిలుపు కధలు అనే పేరు తో మూడు పుస్తకాలుగా ప్రచురణ, అన్వేషణ పుస్తకాన్ని ప్రచురించడానికి ముందు జరిగింది.
శర్మ గారిని కొన్ని ఛానెల్స్ వారు ఇంటర్వ్యూ చేసి సందేహాలకు పొందిన జవాబులు కింద లింకులలో వినవచ్చు
అద్వైతం మీద శర్మ గారి ఇంటర్వ్యూలు.
_The Secret of Spirituality_
https://www.youtube.com/watch?v=JcHdsT7Rq4k
_The path to infinite knowledge._
https://www.youtube.com/watch?v=jeLzJBRp_Ek
_On Advaitha_
https://youtu.be/SKvoGUHG0Cc?si=TJCm52IP5M_sbw1A
_On Mukthi_
https://youtu.be/gqIMFlch9JM?si=5xXJuQauBdyPB_Uj
_On peace of mind._
https://youtu.be/m7K9ZhHIhes?si=BJ-5QuMnRgWpTebz