మంతెన సూర్యనారయణ రాజు(లైలా రాజు)పారిశ్రామికవేత్త​

SKBRC స్థాపించబడిన మొదటి దశకంలో అటు చదువుల్లోను ఇటు క్రీడల్లోను కూడా గొప్ప పేరు గడించింది. మన BasketBall క్రీడా కారులు ప్రతి సంవత్సరం ఆంధ్రా యూనివర్సిటీ టీమ్ , AP stare team లలో కనీసం 3-4, స్థానాలను భర్తీ చేసేవారు. ఆరోజుల్లో LRK , Joseph, బ్రహ్మానందం, కామరాజు , మంతెన సూర్యనారయణ రాజు లు గ్రౌండులో ఆడుతుంటే,
ప్ప్రేక్షకుల కేరింతలతో మారుమోగి పోయేదట.
మంతెన సూర్యనారయణ రాజు AU Basket ball టీమ్ కి captain గా National లో ఆడారు.
 
ఆయన ప్రతిభను మెచ్చుతూ అనేక వార్తాపత్రికలు వ్యాసాలు, వార్తలను ప్రచురించేవి.
మంతెన సూర్యనారయణ రాజు SKBRC ( 1957-60 ) లో BA చదివారు తరువాత నాగపూర్ లో MA ( Public Administration) distinction లో ఉత్తీర్ణత చెంది Ph D లో జాయిన్ అయ్యారు.

తన పరిశోధన అంశంగా – “ తిరుమల తిరుపతి దేవస్థానం పాలన విధానం”ను ఎంచుకున్నారు. కానీ ఇతర పని ఒత్తిళ్ళవలన Ph D పూర్తి చేయ లేక పోయారు.
మాచర్ల లో హ్యూమ్ పైపుల factory లో మేనెజర్ గా చేరారు. అక్కడ 4 సం లు పనిచేసిన తరువాత హైదరాబాద్ వెళ్ళవలసి వచ్చింది. కంపెనీ ప్రధాన యూనిట్ లో కార్మిక అశాంతి సమస్యలు వలన అప్పటికే ఒక సం నుంచి factory lock out లో ఉంది. సమస్యలలో నుంచే కొత్త అవకాశాలు పుడతాయని అంటారు కదా ! మన మంతెన సూర్యనారయణ రాజు కి అదే
జరిగింది !
యాజమాన్యం ప్రధాన factory లోని కార్మిక సమస్యను గౌరవయుతంగా పరిష్కరించి factory ని తెరిపించే బాధ్యతను సూర్యనారయణ రాజుకు అప్పగించింది. ఆయన రెండు నెలలు శ్రమ పడి సమస్యలను పరిష్కరించి ఉత్పత్తిని మొదలుపెట్టారు. ఆ యువకుడు తన శక్తి సామర్థ్యా లను నిరూపించుకున్నాడు . యాజమాన్యం ఆ యూనిట్ ని అతనికి అమ్మడానికి
ప్రతిపాదించింది. ఎంత గొప్ప అవకాశం !
కానీ తమ కుటుంబంలో ఎవరు పరిశ్రమలను స్థాపించి నడప లేదు . ఆ అనుభవం తనతోనే మొదలవుతుంది. అది కష్టతరమైన నిర్ణయం గా మారింది. కుటుంబ సభ్యులు కలిసి వచ్చారు. రాష్ట్రం లో ఒక యువ పారిశ్రామిక వేత్త తన ప్రస్థానం మొదలు పెట్టారు.
సూర్యనారాయణ రాజు దానిని ఒక challenge గా తీసుకున్నారు. 4 సం లలో వారి కష్టం ఫలించి ఆ సంస్థ ఉత్పత్తుల నాణ్యత ప్రమాణాలు కొనుగోలుదారుల మన్ననలను పొందాయి. సంస్థ first class హోదాను పొందింది. టెండర్లు అవసరం లేకుండానే ప్రభత్వ శాఖలకు సరఫరా చేసే స్థాయిని సాధించారు. అది 20 ఏళ్ళపాటు కొనసాగింది.

Turn Around specialist :

కంపెనీలు నీరసపడి మూతపడితే ( sick units) వాటికి ఋణాలు ఇచ్చిన బ్యాంకులు వేలం వేసి వాటిని కొత్త యాజమాన్యాలకు అప్ప చెపుతారు. చిక్కులను విడదీసి sick units లను లాభాల బాట పెట్టిం చడం industrialist లకు ఒక పెద్ద సవాల్. మన సూర్యనారయణ రాజుకు ఆ విద్య బాగానే పట్టు బడింది. మూత పడిన రెండు సిమెంటు రైలుస్లీపర్ ( పట్టాల కింద వాడే దిమ్మలు) యూనిట్ లను సిరామిక్ యూనిట్ లను కొనుగోలు చేసి లాభాల బాట పట్టించారు.
ఎంత ఘనత సాధించారు !
మంతెన సూర్యనారయణ రాజు కి దైవ భక్తి ఎక్కువే ! ఆయన వెంకన్న భక్తుడు. విశాఖ లో అనేక గుడులు నిర్మించి సమాజాన్ని ఆధ్యాత్మిక మార్గం లో నడిపించే కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు .
ఇప్పుడు 85 సం ల వయసులో కూడా ఆఫీసు వ్యవహారాలను స్వయంగా పర్యవేక్షిస్తారు!

Great కదా !

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top