కోనసీమ నుంచి సెంట్రల్ సర్వీసెస్ కు వెళ్ళిన వాళ్ళు తక్కువ! మరీ అందులో డిగ్రీ చదువు తో UPSC పరీక్షను ఛేదించడం చిన్నవిషయం కాదు. ఇంకొంత ముందుకు వెళ్ళి చూస్తే బయోలజీ సబ్జెక్ట్ ను ఎంచుకొని సివిల్స్ గెలిచాడు…
ఎవరీతడు( ?)అనిపిస్తుంది
అతడెవరో కాదు .. మన గండు రాజేశ్వర రావు!
గండు రాజేశ్వర రావు మన కాలేజీ లో B Sc (1968-71 ) చదివారు. Class లో ఉన్న మంచి విద్యార్థుల్లో అతను ఉండే వాడు ఒక సందర్భంలో Zoology Lecturer రామజోగేశ్వర రావు గారు క్లాస్ లో students ని ఉద్దేశించి MSc చేసి lecturer గానో మరొక ఉద్యోగం లోనో settle అయిపోవడం కాదు . Aim big ! UPSC exam ను crack చేయడానికి ట్రై చేయాలి అన్నారట.
అప్పుడే గండు రాజేశ్వర రావు మనస్సులో సివిల్సుకి బీజం పడింది.
1971 లో B Sc Pass అయిన తరువాత UPSC Asst grade పరీక్ష రాసారు. ఆ పరీక్ష ను 1973 లో దేశం లో 30 వ rank సాధించి ఉద్యోగం సంపాదించారు. అది గండు రాజేశ్వర రావు గారి ఆత్మ స్థైర్యాన్ని పెంచింది.
ఢిల్లీ లో ఉద్యోగం చేస్తూ తన లక్ష్యం కోసం చదువు మొదలు పెట్టారు . ఆరోజుల్లో సివిల్స్ కి అవసరమైన మెటీరియల్ సులువుగా దొరికే చరిత్ర, ఆంథ్రపాలజీ వంటి subjects ను optionals ఎన్నుకొని UPSC పరీక్షలు రాసేవారు. మరి రాజేశ్వరరావు మాత్రం తనకు ఇష్టమైన బయోలజీలోనే రాయాలవుకున్నారు. ఢిల్లీ లోని మిత్రులు వారించినా వారి మాట వినలేదు.
1977 లో UPSC EXAM crack చేసి IRS కి సెలెక్ట్ అయ్యారు.
1978 లో ముస్సోరి లోను తరువాత నాగపూర్ లో శిక్షణ పొందారు. అక్కడ Accountancy లో 100% మార్కులు సాధించామే కాక వివిధ అంశాల్లో మొదటి స్థానం లో నిలిచి ఆర్ధిక మంత్రి Gold Medal ను సాధించారు.
మొదటి పోష్టిం గు కాకినాడ నుంచి పదవీ విరమణ చేసే వరకు గండు రాజేశ్వర రావు కెరీర్ మొత్తం సంచలనాలతో నిండిపోయింది.
1977 బాచ్ లోని 120 మంది ఆఫీసర్ లను ఒక్కసారిగా అధిగమించి Jr Administrative grade పొందారు.
1990 లో లండన్ వెళ్ళి RIPA లో Advance Management కోర్సు చదివారు.ఆతరువాత Income Tax జాయింట్ కమీషనరు, కమీషనరు, DG investigations గా పని చేసారు . DG investigations గా ఆయన ఎన్నో High profile కేసులను ఛేదించారు వాటిలో బళ్ళారి ఇనుప ఖనిజం కేసు కూడా ఉంది.
2011 నుంచి చీఫ్ కమీషనరుగా పనిచేసి 2012 లో పదవీ విరమణ చేసారు.అయినా ప్రజ్ఞావంతులను ప్రభుత్వాలు వదులుకో లేవు కదా !
86 మంది IAS , IRS ఆఫీసర్ లతో పోటీపడి కర్ణాటక , ఆంధ్రప్రదేశ్ రాష్ఠ్రా లకు
Insurance Ombudsman గా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక అయ్యారు. ఆ పదవి లో 2016 వరకు పనిచేసి 3000 కేసులను పరిష్కరించారు .
2018 లో తిరిగి CVC చేత HAL/ Andhra Bank లకు Independent External Monitor ( Board Level) nominate చేయబడి 2021 వరకు పని చేసారు.
గండు రాజేశ్వరరావు జీవిత గమనం ఎంతో ఫలవంతమైనది కదా !