మనిషికి అనేక ఇష్టాలు ఉండొచ్చు. కానీ తీవ్రత పెరిగి వాటిలో ఒకటి Passion గా మారితే అది ఒకటేమాత్రమే మిగులుతుందేమో! గిరిజా గణేష్ కి చదువు – పరిశోధనలు జీవిత పరమావధిగా మారి మరి ఏవీ అతనిని ఆకర్షిం చలేకపోయాయి !
గిరిజా గణేష్ మన కాలేజీ లో 1972-74 ల మధ్య ఇంటరు చదివారు. మార్కులను కొల్లగొట్టడం లో దిట్ట .గిరిజాకు చాలా తక్కువ మంది స్నేహితులు ఉండేవారట. క్లిష్టతరమైవ All India science Talent Test పాసై scholarship ను గెలుచుకున్నారు. గిరిజాగణేష్ ఎప్పుడు క్లాస్ టాపర్ గా నిలిచే వాడట.
SKBRC ఎంతో మంది వైద్య నిపుణులను తయారు చేసింది. వారిలో కొండూరి గిరిజా గణేష్ మనమంతా గర్వించ తగిన ప్రపంచ స్థాయి వైద్యులలో ఒకరు!
గిరిజాగణేష్ ను డాక్టరు గిరిజాగణేష్ గా ఆంధ్రా మెడికల్ కాలేజీ (1975-80) తీర్చి దిద్దింది.
1980-82 లో అతను మనదేశం లో ఖ్యాతిగాంచిన AIMS నుంచి PG ( Paediatrics) చేసారు.
1985 నాటికి అమెరిక లో రెసిడెన్సీ ప్రోగ్రామ్ చేసారు.
1987 వాటికి University of Arkansas నుంచి Neonatology లో Fellowship పొందారు.
1919 లో University of Texas ( Dallas) నుంచి Healthcare management లో MS చేసారు
Dr Konduri Girija Ganesh జ్ఞాన తృష్ణకు అంతులేదు.
ఆయన చదివిన చదువులు, పరిశోధనల గురించి రాయాలంటే చాలా పేజీలు పడతాయి.|
ఆయన Neonatology లో ప్రపంచ ఖ్యాతిని గడించారు.
డా. Konduri Girija Ganesh గత 22 సం॥లుగా MCW (Newyork)లో Neonatology Chief గా ఉంటున్నారు.