బహుముఖ ప్రజ్ఞాశాలి
దాసు వామన దామోదర్ రావు ( దాము)
బహుముఖ ప్రజ్ఞాశాలి
కాలేజీ విద్యార్థులతో ఆరోజు హైస్కూల్ గ్రౌం డు కోలాహలంగా ఉంది . లెక్చరర్ – స్టూడెంట్ టీమ్ ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరగబోతోంది . అది సరే! కేప్టెన్ లు ఎవరో తెలుసా ? ఒక సీనియర్ స్టూడెంట్ తన జూనియర్ స్నేహితుడిని క్విజ్ చేస్తున్నాడు.
సమాధానం కోసం ఎదురు చూడకుండా రెట్టించిన ఉత్సాహంతో తానే చెప్పేసాడు. తెలుసుకో …. ఇది తండ్రి కొడుకుల మధ్య పోటీ …. ఎవరు నెగ్గుతారో (?) టెన్షన్ గా అన్నాడు .
లెక్చరర్స్ టీమ్ కు HOD Physics ఉపేంద్ర రావు గారు కేప్టెన్ …. మరి స్టూడెంట్సు టీమ్ కు వారి కుమారుడు దామోదర్ రావు కేప్టెన్. ఆట రంజుగా జరిగింది. గెలుపు ఓటముల ప్రసక్తి లేకుండా అందరు బాగా ఎంజాయ్ చేసారు.
అసలు దాము మన కాలేజీ లో చేర వలసిన వాడు కాదు. Twelfth లో అతను స్కోర్ చేసిన మార్కులు అతనికి మెడిసిన్ లో సీటు సంపాదించాయి. అయినా … తండ్రి ఉపేంద్ర రావు గారి సలహా మేరకు IAS లక్ష్యం గా BSc లో చేరారు.చదువుతో పాటు క్రికెట్ , వ్యాసరచన, వక్తృ త్వ పోటీల్లో దాము మొదటి స్థానంలో నిలిచే వాడు !
అమలాపురం MP BS Murthy స్మారక Gold Medal విజేత మన దాము. ఆయనతో కొంచెం పరిచయమున్న వాళ్ళందరు దాము ని ఒక IAS in making గా చూసేవారు.
తాను చదువుకొంటూ PUC విద్యార్థులకు పాఠాలు చెప్పేవాడు. తనకంటే మంచి మార్కులు పొందిన తోటి విద్యార్థులను అభినందించి వారి ప్రతిభ ను చూసి పొంగి పోయేవాడు .
ASR గారు అప్పుడే మన కాలేజీలో Physics Lecturer గా చేరారు.తన క్లాసు లో చదువుతున్న చీమలపాటి సూర్యనారయణ ( సురేష్) ను ఆయన వద్దకు తీసుకు వెళ్లి మాష్టారు ఇతను maths లో 300 కి 300 మార్కులు score చేసాడండి(!) అని పరిచయం చేసి మురిసి పోయాడట .
కందా భాస్కరమ్మ గారు ( HOD mathematics) ఎప్పుడైన శలవు పెట్టినపుడు ప్రిన్సిపాల్ రమేశం గారు ఆక్లాసు తీసుకోవడం ఒక రివాజు . ఒకపరి అలా రమేశం గారు దాము వాళ్ళ క్లాసు తీసుకున్నారు. Maths సిలబస్ లో లేని కొన్ని ప్రోబ్లెమ్సును గురించి వివరిస్తున్నపుడు మద్యలో బెల్ విపించడంతో ఆగి పోయి ఇది చాలా కష్టతరమైనది మళ్ళీ ఎప్పుడైన చెపుతాను అని వెళ్ళిపోయారట.
Suresh గా పిలువబడే దాము క్లాస్మేట్ దానిని రెండు పద్ధతుల్లో solve చేయవచ్చు అని దాము కు చూపాడట. దాము అతను వద్దన్న వినక చేయి పట్టుకొని రమేశం గారి వద్దకు తీసుకు వెళ్ళి విషయం వివరించాడట. రమేశం గారు చాలా సంతోషించి సురేష్ ను అభినందిస్తే అతని కంటే ఎక్కువ దాము సంతోషపడి పోయాడట. ఈ విషయం సురేష్ స్వయంగా చెప్పారు.
AU లో MSc ( Physics) పూర్తిచేసి 1974 లో తిరిగి అమలాపురం చేరుకొని తన సివిల్స్ పరీక్ష కోసం చదువు మొదలు పెట్టాడు.
సరే ! సివిల్స్ కి టైమ్ ఉందికదా అని Bank Probationary exam రాసారు.interview కి పిలుపు వచ్చింది. Mr PV ( English) దాము కి mock interviews ను కండక్ట్ చేసేవారు. SBH లో select అయ్యినట్లు లెటర్ వచ్చింది. ఏంచేయాలి?
దాము dilemma లో పడ్డాడు. మధ్యతరగతి కుటుంబంలో పెద్దకొడుకు తీసుకొనే నిర్ణయమే దాము కూడా తీసుకున్నాడు.
Bank ఆఫీసర్ ఉద్యోగం లో చేరి సివిల్స్ కు తిలోదకాలిచ్చాడు.
దాముకి అమలాపురం అన్నా తాను చదివిన SKBRC అన్నా వల్లమాలిన ప్రేమ! bank ఉద్యోగంలో కొనసాగేటప్పుడు కూడా
ఎందరో యువకులను దాము తన రూమ్ లో ఉంచుకొని భోజనం పెట్టి competitive exams కి తర్ఫీదునిచ్చి సాయం చేసేవాడు.
తన రిటైర్మెంట్ తరువాత అమలాపురం ఒక institute పెట్టి సివిల్స్ తో సహా ఇతర పోటీ పరీక్షలకు మన కాలేజీ విద్యార్ధులకు శిక్షణ గరపాలని కలలు కన్నాడు. అతని వ్యక్తిత్వం గురించి చెప్పాలి అంటే … “బహుజన సుఖాయ బహుజన హితాయచ”
అనే ఋగ్వేద మంత్రం గా చెప్పుకోవాలి!
దురదృష్టం . చెన్నయ్ లో జరిగిన ఒక accident లో తన 39 వ ఏట దాము చనిపోయాడు.
GSAA కి దాము ఒక స్పూర్తి ప్రదాత !
దాము కల అమలాపురం లో “Training centre for competitive exams” ను సాకారం చేయడమే ఆయనకు మనం ఇవ్వగలిగిన నివాళి !