విజ్ఞాన – వేదాంతాల సంగమ రూపం

స్వామి తత్వవిదానంద సరస్వతి
( పూర్వాశ్రమ నామం: రాణి రామ కృష్ణ )

రాణి రామకృష్ణ గారు లౌకిక విద్య కోసం పాఠశాలలో చేరకముందే వేద, వేదాంగాలను ,సంస్కృత భాషా జ్ఞానాన్ని తన తండ్రి మహమహోపాధ్యాయ నరసింహ శాస్తి గారి నుంచి నేర్చుకొన్నారు. రాణి రామకృష్ణ గారు SKBRC లో 1966-69 మధ్య B.Sc (MPC) చదివారు. రామకృష్ణ ఆకాలంలో సహవిద్యార్థులకు ఎందరికో స్పూర్తి దాయకంగా నిలిచారు.ఆయనకు పాఠం చెప్పడానికి Lecturers మహదానంద పడేవారట! ఒకసారి Physics Lecturer ASR గారిని Stroboscope గురించి ప్రశ్నించినపుడుసాయంకాలం ఇంటికి వచ్చి కలవ మన్నారట. రామకృష్ణ. మరొక సహవిద్యార్ధి కలసి ASR గారింటికి వెళ్ళారట. ASR గారు అందుబాటులో ఉన్న Tablefan , light లను ఉపయోగించి Stroboscope concept ను explain చేసారట. అదీ విద్యపట్ల ఆ గురు-
శిష్యుల కమిట్ మెంట్ !
రామకృష్ణ గారికి చదువు తప్ప వేరే వ్యాపకాలు ఉండేవి కావుట. ఒకసారి వారి సహవిద్యార్ధి బలవంతం మీద సినిమాకు వెళ్ళారట. విరామంలో స్నేహితుడు బయటకు వెళ్ళి వచ్చేసరికి రామకృష్ణ గారు పుస్తకం చదువుకుంటూ కనిపించారట. ఇక ఆ స్నేహితుడు విస్తుపోవడం తప్ప మరేమి చేయగలడు చెప్పండి ?
అతనితో అతనికే పోటీ ! CVS ( maths Lecturer) గారు చెప్పిన 5 problems ను solve చేసి, మళ్ళీ చేయడం మొదలు పెట్టారట. ఏమిటి మళ్ళీ చేస్తున్నావు అని అడిగితే ఇంతకు ముందు వీటిని solve చేసేందుకు 20 నిముషాలు పట్టిం ది. ఇంకెంత త్వరగా చేయగలనా(?) అని చూస్తున్నాను అన్నారట.
అంతటి ప్రతిభావంతుడికి AU Gold Medal తో సత్కరించకుండా ఎలా ఉంటుంది?

B Sc University first గా ఉత్తీర్ణుడు అయ్యారు.

AU నుంచి M Sc ( chemistry ) తరువాత డాక్టోరేట్ పొందారు.

SV University నుంచి సంస్కృతంలో డాక్టోరేట్ పొందారు.

మహమహోపాధ్యాయ అనిపించుతున్నారు. వారు వేదార్ధం చెపుతూ రాసిన dissertation పలువురి ప్రశంసలను అందుకుంది. (Vedi సంస్కృతం , Classical సంస్కృతం కు కొంచెం భిన్నమైనది. బహు తక్కువ మందికి మాత్రమే అది తెలుసు.) UPSC పరీక్షలు వ్రాసి IPS కి సెలెక్టు అయ్యారు. కానీ వారికి విజ్ఞాన శాస్త్రం , పరిశోధనల మీద ఉన్న మక్కువ వలన IPS ను తిరస్కరించి.


IDPL లో పరిశోధకుడి గా చేరారు. 15 సం ల సర్వీసు కాలం లో మన్ననలను పొందారు.ఆ తరువాత స్వామి దయానందా సరస్వతి ప్రేరణ తో రాణి రామకృష్ణ సన్యసించి స్వామి తత్వవిదానంద సరస్వతిగా మారారు.
అధ్వైతవేదాంతం మీద 70 కు పైగా గ్రం ధాలను English , Sanskrit, Telugu భాషల్లో ఆవిష్కరించారు.
హైదరాబాద్ తో సహా అనేక పట్టణాల్లో అధ్వైత వేదాంతంపై తరగతులను నిర్వహిస్తున్నారు. వారి ఉపన్యాసాలు కఠినమైన వేదాంత భావజాలాన్ని సామాన్యులకు సైతం అర్ధమయ్యేటట్లు సున్నితమైన హాస్యాన్ని జోడించి చెపుతారు. క్రమం తప్పకుండ సంవత్సరంలో కొన్ని రోజులు పెన్సిల్ ే నియా రాష్ట్రం లోని సేలోర్సబర్గ్లో ని ఆర్షవిద్యాపీఠం లో స్వామి తత్వవిదానంద వేదాలను బోధించి వస్తారు. కీ శే ఘనశ్యామ్ ప్రసాద్ గారు ఆ విద్యాపీఠాన్ని సందర్శించి స్వామి వారి బోధన పటిమను చూసి చాలా సంతోషపడినట్లు చెప్పారు.


ఒక్కమాటలో చెప్పాలంటే వారు “ప్రజ్ఞానం బ్రహ్మః“ అనే మహా వాక్యానికి సాకారం! .

1 thought on “విజ్ఞాన – వేదాంతాల సంగమ రూపం”

  1. శంకర్ భమిడిపాటి

    పూజ్య స్వామి జీ గా తెలిసిన నాకు, వారి ప్రవచనములు, రాసిన పుస్తకాలు ఉన్నతమైన స్థాయిలో ప్రభావితం చేసిన వ్యక్తులలో నేను కూడా ఉన్నా. వారి ఏ ప్రవచనం విన్నా, నాకు చాలా అద్భుతంగా, ఒక సైన్స్ పాఠం లా ఉంటుంది. ఒక పదార్ధం రుచి చెప్పమంటే ఏం చెబుతాం, రుచి చూసి తెలుసు కో అంటాం. వీరి ప్రవచనాల విషయం లో రుచి మరిగి ఆనందంగా ఉండడం సాధ్యం 🙏🙏🙏🙏

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top