This page is dedicated to those Alumni who won laurels in their fields of work.
We will publish details of One Great Personality. In every 15 days

USN Murthy
Director , NIPER- Guwahati

1975 సంగతి ఇది ! కాలేజ్ లో అడ్మిషన్స్ జరుగుతున్నాయి. ప్రిన్సిపాల్ రామేశం గారి ముందు ఒక విద్యార్థి తన అడ్మిషన్ కోసం నిలబడ్డాడు . అతన్ని పరికించి చూస్తూ రామేశం గారు  కొంచెం వాచ్ చేయ వలసినవాడీ   అన్నారు . బదులుగా ఆ విద్యార్థి  అలాగే సార్ అని నిలబడ్డాడట . కొంచెం కాదు వీణ్ణి  చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి అన్నారట పక్కనున్న  ఫాకల్టీ మెంబరుతో … ఆ విద్యార్థి  ఈనాటి మన కథానాయకుడు USN Murthy .

క్లాస్ లో తెలివైన విద్యార్థులలో ఒకడిగా పోటీ పడుతూ చదివే వాడు . కొంచెం కొంటెతనంతో నవ్వుతూ తుళ్లుతూ క్లాస్ ను హుషారుగా ఉంచేవాడు . ఎప్పుడైనా మూర్తి కాలేజ్ కి రాకపోతే ఆ రోజు క్లాస్ చిన్నబోయేది !

ఈనాడు వార్త పత్రికలో వారాంతంలో “ చదువు” అనే శీర్షిక వచ్చేది .  కొత్త కొత్త కోర్సుల వివరాలతో  విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఆ శీర్షికను సుమారు మూడు దశాబ్దాల పాటు నడిచింది. ఆ శీర్షికను నిర్వహించిన వ్యక్తి  ప్రిన్సిపాల్ గారి scanner లో ఉంచాలి అన్న విద్యార్థి ఒకడే ! అతను ఇలాంటి ఘన కార్యాలు ఇంకెన్ని సాధించాడో  చూద్దాం రండి.।

USN మూర్తి మన కాలేజ్ లో  BSc (1978 ) AU నుంచి ఎంఎస్సీ ( 1980)  OU నుంచి Doctorate పట్టాలను పొందారు .ఏయూ లోని వారి సహ విద్యార్థులు  చాలామంది బ్యాంకు , టీచింగ్ ఉద్యోగాలకు వెళ్లారు. USN మూర్తి తనకు ప్రీతిపాత్రమైన పరిశోధనల వైపు వెళ్లారు.

పాండిచ్చేరి లోని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహణ లో పనిచేసే vector control Lab లో తన పరిశోధనలు మొదలుపెట్టారు .  మలేరియా వ్యాధి మోడలింగ్ , Integrated  control మీద పరిశోధనలు చేశారు.

ఆయన దృష్టి పట్టు పరిశ్రమ మీద పడి దిగుబడి పెంచే మార్గం చూపిస్తే రైతుల ఆర్థిక కష్టాలు తీర్చవచ్చని దేశ దిగుమతుల ఖర్చు తగ్గించవచ్చని భావించి మైసూర్ లోని పరిశోధన శాల లో పని మొదలు పెట్టారు .

అక్కడినుంచి హైదరాబాద్ లోని Regional Research Labs లో సైంటిస్ట్- B గా చేరి  అనతికాలం లోనే chief scientist గా , Biology Division హెడ్ –  గా ఎదిగారు .

ఖ్యాతిగాంచిన NIPER గౌహతి కి వ్యవస్థాపక డైరెక్టర్ మన  USN Murthy !  అక్కడ పరిశోధకుడు మూర్తి ఆచార్యుడిగా , ద్రష్టగా  పరిణితి చెందారు. పరిశోధనల కోసం Super computers ( PARAM, EMBRYO) ను సాధించి తెచ్చారు.. అతని గైడెన్స్ లో  15 మంది Research scholars  Ph D పట్టాలు పొందారు . NIPER  పరిశోధన ఫలితంగా తయారైన ఔషధాల technology ను పరిశ్రమలకు బదలాయించి వాటి commercialisation కు  తోడ్పడ్డారు . ముఖ్యంగా Covid సంక్షోభం సమయం లో ఇవి ప్రజలకు బాగా ఉపకరించాయి.

Prof. USN Murthy పొందిన గౌరవాలు, సత్కారాలు గురించి రాయాలంటే పేజీలు సరిపోవు కొన్ని ముఖ్యమైనవాటిని ప్రస్తావిస్తాను.

  • WHO / TDR Award
  • German Research Foundation Award
  • ICMR Biomedical Research Award
  • Zandu Award-2021 conferred by the Society of Ethnopharmacology,
  • Fellow of the Association of Biotechnology and Pharmacy,
  • Fellow of Telangana Academy of Science
  • Fellow of Andhra Pradesh Academy of Science
  • Gold Medal from the Association of Biotechnology and Pharmacy
  • Gold Medal from the Zoological Society of India

.  visiting Professor at York University, Canada,

   visiting Professor at central University, of Hyderabad,

ప్రస్తుతం  Prof మూర్తి  NIPER గౌహతిలో  నీతి అయోగ్ నిధులతో నడిచే BIRAC Incubation Centre  ATAL Incubation center లకు చైర్మన్ గా వ్యవహిరుస్తున్నారు

CSIR సలహా సంఘ సభ్యుడిగా , భారత జాతీయ పసుపు బోర్డు సభ్యుడిగా . పని చేశారు .

Prof మూర్తి మన దేశంలోని 2 తప్ప అన్ని NIPER centre లలో డైరెక్టర్ గా పని చేశారు.ఎనిమిది దేశాలలోని ప్రఖ్యాత పరిశోధన శాలలను చుట్టి వచ్చారు .

ఆనాటి మన కాలేజ్ ప్రిన్సిపాల్ జీపీ  రామేశం గారు ఏ ముహూర్తం లో అన్నారో గానీ మన Prof USN మూర్తి ఇప్పటికీ lime light లో ఉంటున్నాడు .

మీరు మాకు గర్వ కారణం , Prof మూర్తి !

Scroll to Top