వారణాసి ఉదయ భాస్కర్ Former CMD Bharat Dynamics Ltd ( BDL)
NCC training లో భాగంగా ఫైరింగ్ రేంజ్ ఒకటి మన కాలేజ్ లో ఉండేది. అక్కడ దీక్షగా ప్రాక్టీస్ చేస్తున్నాడు చూశారా అతనే మన ఉదయ భాస్కర్ . Bsc చదువుతున్నాడు .ఆ సమయంలో అతన్ని flight సైన్స్ బాగా ఆకట్టుకుంది .ఈ అబ్బాయి భవిష్యత్తులో మిస్సైల్ లను తయారు చేసే BDL లాంటి సంస్థ కు CMD అవుతాడని ఎవరు ఊహించి ఉండరు . అతను కూడా….. ఇంతకు ముందు ఆణిముత్యాల hero లు చెప్పినట్లు …. తన career లో సాధించిన విజయాలకు కాలేజ్ faculty ఒక ముఖ్య కారణం అంటారు ఉదయ్ భాస్కర్ 75 seats మాత్రమే ఉండే Harcourt Buttlar Tech. Institute, ( కాన్పూర్) లో ఎంట్రన్స్ పరీక్షలో మొదటి స్థానంలో నిలిచి scholarships తో సీట్ పొందారు. దానికి మన కాలేజ్ లో పడిన బలమైన పునాది దోహదం చేసింది అంటారు ఉదయ భాస్కర్ . HBTU లో నేర్చిన అంతర్జాతీయ స్థాయి టెక్నాలజీ అతని జీవితాన్ని మలుపు తిప్పింది . M Tech (పాలిమర్ సైన్స్ )కోసం IIT DELHI లో చేరారు . IIT లో బోధన విద్యార్థుల critical thinking ను encourage చేసే విధంగా వుంటుంది. అది మీకు తెలుసు.ఒకసారి క్లాస్ లో ప్రొఫెసర్ polymer లో అంతా వరకు లేని కొత్త అప్లికేషన్ గురిచి వ్రాయమన్నారు . ఏం రాయాలి (?) అని క్లాస్ అంతా తీవ్ర ఆలోచనలో మునిగి పోయింది. ఉదయ భాస్కర్ osmosis ప్రక్రియ ను చెప్పి అందరి మన్ననలు పొందాడు . BATA కంపెనీలో intern గా పని చేస్తున్నప్పుడు ఒక రోజు ప్రొడక్షన్ లైన్ లో polymer గట్టిపడి పోయి ఉత్పత్తి ఆగిపోయింది. దానిని క్లీన్ చేయడానికి ఎవరి తరం కాలేదు . ఆ బాధ్యత తీసుకొని కొన్ని గంటల వ్యవధిలో సమస్యను పరిష్కరించి BATA యాజమాన్యం మన్నన పొందారు . కొన్ని సంవత్సరాలు Bakelite hylam ( Hyderabad ), Dytron India Limited ( Kolkata), వంటి సంస్థలలో వేరు, వేరు స్థాయిలలో పని చేసి 1990 నాటికి బీడీఎల్ లో మేనేజర్ గా చేరారు . Flight sciences మీద ఉన్న passion తో BDL లో వేరు వేరు departments లో పని చేసి చాలినంత నైపుణ్యం సాధిస్తూ ఏజీఎం , జీఎం ,Director (production) గాను పదోన్నతులు పొంది చివరకు 2015 నాటికి CMD గా నియామకం పొందారు. BDL ఒక భారత ప్రభుత్వరంగ సంస్థ !. 1970 నుంచి మనుగడలో ఉంది. దేశ సైనిక అవసరాల కోసం వివిధ మిసైల్స్ ను తయారు చేస్తుంది. ఈ వివరణ 2015 లో మన ఉదయ భాస్కర్ దానికి CMD గా వచ్చే వరకు సరిపోతుంది ! ఉదయ భాస్కర్ ఆధ్వర్యం లో 2015-19 మధ్య BDL ఆధునీకరణ, అనుబంధ సంస్థలకు శిక్షణ, తోడ్పాటు ద్వారా తమ సాలుసరి ఉత్పత్తి విలువను ₹. 1700 కోట్లు నుంచి ₹4600 కోట్లకు పెంచుకుంది . IPO ద్వారా ప్రజల నుంచి పెట్టుబడులు స్వీకరించడం అనేది రక్షణ రంగం లోని సంస్థకు , ప్రైవేట్ రంగంలోని సంస్థలకు చాలా భేదం ఉంటుంది. దేశ భద్రత దృష్ట్యా BDL తమ ప్రాజెక్టు వివరాలను( Prospectus )పూర్తిగా వెల్లడించకుండా పెట్టుబడి దారులను మెప్పించగలిగితేనే సఫలం అవుతుంది. అది ఒక సున్నితమైన అంశం. దానిని అధిగమించి IPO ను విజయవంతం చేయడం ఉదయ భాస్కర్ పరిణతికి నిదర్శనం. అదే సమయంలో రక్షణ ఉత్పత్తుల ఎగుమతి విధానం రూపుదిద్దుకోవడంతో BDL కు , ఉదయ భాస్కర్ బృందానికి మరో గొప్ప అవకాశం లభించింది. ఫలితాలను సాధించే క్రమంలో , ఉదయ భాస్కర్ ప్రవేశ పెట్టిన “ కాఫీ టేబుల్ బుక్ “ఆలోచన BDL లోని వివిధ departments ల సమన్వయానికి ఉపయోగపడింది. ఉదయ్ భాస్కర్ learning curve పైపైకి సాగుతూనే ఉంది. CMD గా రక్షణ శాఖ కార్యదర్శితో , DRDO శాస్త్రవేత్తలతో రక్షణ మంత్రులతో , ప్రధాన మంత్రితో సమావేశాలు ఆయనకు నిత్యకృత్యంగా మారాయి. ఉదయ భాస్కర్ , ఆ మీటింగులను గుర్తు చేసుకుంటూ ••• మనం అనుకునే విధంగా వీరెవ్వరు కులాసాజీవితం గడపరు. రోజుకి 18 గం పని చేస్తారు ,అది కూడా చాలా focused గా ,అని తన అనుభవం గా చెప్పారు. చాలా మంది వృత్తిసాధకుల లాగే ఉదయ భాస్కర్ కూడా “ Learn & contribute” సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతారు. తన అనుభవసారాన్ని , IIM లు , IIT లు , అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ , IPE లకు వెళ్లి అక్కడ high profile ఆఫీసర్లతో పంచుకుంటున్నారు ! UPSC సెలక్షన్ బోర్డు సభ్యుడిగా పనిచేశారు. central Vigilance commission (CVC)చేత నియమించబడి కొన్ని సంస్థలలో Independent Extrrnal Monitor గా పనిచేశారు. ప్రస్తుతం Ministry of Ayush కోసం పని చేస్తున్నారు. నిరంతర విద్యార్ధి మన ఉదయ భాస్కర్ కు అభినందనలు !