Justice BSA Swamy

1959 కాలేజీ అడ్మిషన్లు పూర్తయ్యాయి. క్లాసులు కూడా మొదలై పోయాయి. యూనివర్సిటీ నుంచి ప్రత్యేక అనుమతి తో SKBRC లో BSc క్లాసులో ఒక విద్యార్థి చేరారు . అతని Roll no 115 A , పేరు BSA స్వామి.

ఆ BSA Swamy కాలేజీలో గడిపిన మూడుసంవత్సరాలు చదువు, సాంస్కృతిక కార్యక్రమాలు,విద్యార్థి రాజకీయాలలోఉత్సాహవంతంగా పాల్గొన్నారు. Debating, Elocution , నాటకాలు ఏమైన కానీండి పోటీలో స్వామీ ఉంటే బహుమతి ఆయనదే !

1961-62 విద్యార్థి సంఘ ఎన్నికల్లో President గా పోటీ చేసి గెలిచారు. అప్పుడు చిగురులు తొడిగిన నాయకత్వ లక్షణం ఆయన జీవితం చివరి వరకు కొనసాగింది.

AU నుంచి న్యాయపట్టా పొంది హైదరాబాద్ లో అల్లాడి కుప్పుస్వామి , శివశంకర్ వంటి ప్రముఖుల వద్ద జూనియర్ గా పనిచేసారు. 1974 లో స్వంతంగా High court లో Practice మొదలు పెట్టారు.

న్యాయవాదిగా పనిచేస్తున్నపుడు యువ న్యాయవాదుల సంఘం పెట్టి వారి సమస్యలకు పరిష్కారాల కోసం పోరాటం చేసారు.

సామాజిక న్యాయం :

నిమ్న వర్గాల కోసం ఆయన పడిన ఆరాటం BC, SC, ST న్యాయవాదుల సంఘ నిర్మాణంలో ప్రస్పుటంగా కన్పడుతుంది. ఆయన, సర్ధార్ గౌతు లచ్చన అనుయాయి. Gouthu Lachanna Organisation for Weaker sections (GLOW) నిర్మాణానికి కృషిచేసారు. చైతన్య రధం లాంటి ఒక మోటారు కారును ఏర్పాటుచేసుకొని

గ్రామ, గ్రామాల్లోని బడుగు, బలహీన వర్గ ప్రజలను చైతన్య పరిచారు.వారి సేవలకు గుర్తింపుగా Periyar International (USA) BSA Swamy గారిని “K Veera Mani award” forsocial Justice తో గౌరవించింది.

కొంత కాలం “మన పత్రిక “సంపాదకుడిగా పనిచేసారు.

వ్యక్తిత్వం :

స్వామి గారు బలహీన వర్గాల అభ్యున్నతి కోరుకున్నారు. కానీ వారికి ఇతర వర్గాల పట్ల ద్వేషం లేదు. రేడికల్ భావాలను కలిగి కూడా ఆయన atheist కాదు. ఒకవిధంగా చెప్పాలంటే ఆయన పరిపూర్ణ మానవుడు !

Educationist :

Justice Swamy తన తండ్రి పేరిట BRM Education society ని స్ధాపించి తమ స్వగ్రామం ముక్తేశ్వరం లో పోలీటెక్నిక్ కాలేజీ పెట్టారు. పోలీటెక్నిక్ కాలేజీ యే ఎందుకు ? ఇంజినీరింగు కాలేజీ పెట్టొచ్చు కదా అని మిత్రులు అంటే … జస్టిస్ స్వామి బలహీన వర్గాల పురోగతికి పోలీటెక్నిక్ తొలి మెట్టు అన్నారట.

Justice BSA Swamy ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానంలో Judge గా 1995 నుంచి 2004 వరకుపనిచేసారు. 2008 లో Justice BSA Swamy గుండె పోటుతో మరణించారు. 

వారు నెలకొల్పిన విద్యాసంస్థలు మాత్రం ప్రజా సేవలో పురోగమించాయి!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top