దేశ ఆర్థిక పరిస్థితిని మార్చడానికి దోహద పరిచిన ముఖ్య అంశాలలో ఒకటి సముద్ర తీరాల ( off
shore) నుంచి ముడి చమురు క్షేత్రాల అన్వేషణ , గుర్తింపు , ఉత్పత్తి!
దీనికి ఆధారం గా నిలిచిన పరిశోధన గ్రం థం Basin Evolution and petroleum Prospectivity of the Continental Margins of India ఈ గ్రంథకర్తలలో ఒకరు మన మునుకుట్ల రాధాకృష్ణ !
ఈ పుస్తకం ప్రపంచ ఖ్యాతి గడించింది .ఇది ఒక reference పుస్తకం !మునుకుట్ల రాధాకృష్ణకు చిన్నతనం నుంచి తెలివైన వాడిగా పేరు ఉండేది SKBRC లో చేరాక Physics Lecturer ASR గారి దృష్టి మన మునుకుట్ల రాధాకృష్ణ మీద పడింది .
ఆయన విద్యార్ధులలో నిబిడికృతమైన ప్రజ్ఞా పాటవాలను బయటకు తీయడం లో దిట్ట కదా ! ఆ గురు-శిష్యుల బంధం దేశానికే ఒక అద్భుతమైన శాస్త్రవేత్తను ఇచ్చింది !
AU లో M Sc ( Marine Geophysics ) చదివే రోజులలో క్లాస్ లో మొదటి స్థానం లో ఉండే వారు . ఆ టైం లో విద్యార్థులకు ఒక అరుదైన అవకాశం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓసియానోగ్రఫీ ( NIO) రూపంలో వచ్చింది . క్లాసులో 5 గురు విద్యార్థులు AU నుంచి GoA కు NIO వారి Research vessel లో Internship కోసం పంపారు. తీరా అక్కడికి వెళ్ళాక వారిలో ఒక్కరికే ఆ అవకాశం ఉందని అధికారులు చెప్పారు . మీరే నిర్ణయించండి అని అక్కడి సైంటిస్ట్ లకే వదిలేశారు. ఆ అవకాశం మునుకుట్ల రాధాకృష్ణకు ఇచ్చారు.
తరువాత… M Sc క్లాస్ లో మొదటి స్థానం పొంది ధన్బాద్ లోని Indian School of Mines ( ఇప్పుడుIIT-ISM) లో Ph D చేయడానికి వెళ్లారు . అప్పటికి Marine Geophysics లో డాక్టరేట్ పొందిన, అతి తక్కువ మంది లో మునుకుట్ల రాధాకృష్ణ ఒకరు !
Dept of Ocean Development లో కొంతకాలం పనిచేసి టీచింగ్ మీద పరిశోధనల మీది మక్కువతో మొదట Cochin University of Science & Technology లో lecturer గా చేరారు. అది వారి జీవితంలో గొప్ప మలుపు. ఎందుకంటే…. అక్కడ మునుకుట్ల రాధాకృష్ణ కు ఎందరో విద్యార్థులను శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దే అవకాశం కలిగింది . దానితో బాటు వారి పరిశోధనలు వారికి ఎంతో ఖ్యాతిని సంపాదించి పెట్టాయి.
2000 సం లో Indian Geophysical Union రాధాకృష్ణకు MS కృష్ణన్ గోల్డ్ మెడల్ ఇచ్చి గౌరవించింది.
2004 సం లో ఖ్యాతిగాంచిన Commonwealth Academic staff మునుకుట్ల రాధాకృష్ణ ను UK లోని దుర్హాం విశ్వవిద్యాలయం తో కలిసి పరిశోధనలు చేసేందుకు ఫెలోషిప్ ను ఇచ్చారు.
2007 సం లో మునుకుట్ల రాధాకృష్ణ IIT Bombay లోని Earth Sciences dept లో చేరారు అక్కడ పని చేస్తున్నప్పుడు ఒక సాయంత్రం రాధాకృష్ణ కు ASR గారి నుంచి ఫోన్ వచ్చింది నువ్వు చేర వలసిన చోటు ( IIT-Bombay ) కి చేరావు అని అభినందించారు ! ASR గారు దీవించినట్లే IIT Bombay లో మునుకుట్ల రాధా కృష్ణ పరిశోధనలు అతనికి జాతీయ అంతర్జాతీయ ఖ్యాతిని గడించాయి
Monash University, Australiaతో సంయుక్తం గా Ph D program నిర్వహించే అవకాశము వచ్చింది
UK కు చెందిన Southampton University తో కలిసి పరిశోధనలు చేయడం మొదలుపెట్టారు మునుకుట్ల రాధాకృష్ణ !
2018 సం లో మునుకుట్ల రాధాకృష్ణ ఉన్నత బోధనా నైపుణ్యానికి గుర్తిం పుగా వారికి
S.P. Sukhatme ప్రతిభా పురస్కారం లభించింది .
2019 సం లో మునుకుట్ల రాధాకృష్ణ కు భూగర్భ వనరుల మంత్రిత్వ శాఖ ,వారిని ప్రతిభా పురస్కారం తో సన్మానించింది
2021 సం లో Indian Geophysical Union వారు మునుకుట్ల రాధాకృష్ణ కు అరుదైన Decennial Award ను ఇచ్చి గౌరవించింది.
మునుకుట్ల రాధాకృష్ణ గైడెన్స్ లో 25 కు పైగా విద్యార్థులు డాక్టరేట్ పట్టాలను పొందారు . వారంతా వివిధ IIT లలోను , జాతీయ అంతర్జాతీయ పరిశోధన సంస్థలలో ఉన్నత పదవులలో పని చేస్తున్నారు.
ఇప్పుడు మన మునుకుట్ల రాధాకృష్ణ అనేక జాతీయ అంతర్జాతీయ సంస్థలలో గౌరవ పదవులను
నిర్వహిస్తున్నారు ,
Prof. Munukutla RadhaKrishna ఇప్పుడు IIT Bombay లో ఎర్త్ సైన్సెస్ విభాగాధిపతి !
పూజ్యగురువులు ( లేట్) ASR గారికి జేజేలు !
వారి శిష్యుడు Prof. మునుకుట్ల రాధాకృష్ణ కు అభినందనలు !!